A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ మంత్రి అల్లుడు’ రియల్ ఎస్టేట్ కింగ్
Share |
September 22 2018, 2:58 am

ఆ మంత్రి అల్లుడు’ రియల్ ఎస్టేట్ కింగ్!అంటూ తెలుగు గేట్ వేలో ఈ సంచలన కదనం ఇచ్చారు. వాసిరెడ్డి శ్రీ్నివాస్ ఆ మంత్రిగారి అల్లుడు పేరు కూడా చెబుతారేమోచూడాలి.

ఈ మధ్యే ఓ ఖరీదైన కారు కొనుగోలుతో వార్తల్లోకి ఎక్కిన మంత్రిగారి అల్లుడి దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైద్య శాఖలో భవనాల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు క్లియర్ చేయాలంటే ఆయనకు ‘వాటా’ ముట్టచెప్పాల్సిందే. అది కూడా భారీ మొత్తంలో. లేదంటే అవి ఎప్పటికీ అలా పెండింగ్ లో ఉండిపోతాయి. అస్మదీయ కాంట్రాక్టర్లకు మాత్రం ఒకేసారి బిల్లులు అలా మంజూరు అయిపోతాయి. సదరు అధికారికి ఒక్క విజయవాడలోనే ఏకంగా 30కిపైగా అపార్ట్ మెంట్స్ ఉన్నాయంటే ఆయన గారి అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.పోనీ ఇవేదో సాదా సీదా అపార్ట్ మెంట్లు కూడా కావు. అన్నీ ప్రీమియం విభాగంలోనివే. అంతే కాదు..ఇప్పుడు కొత్తగా విజయవాడ నగరంలో ఒక ఎకరంలో డెవలప్ చేస్తున్న వెంచర్ లో ఏకంగా 20 అపార్ట్ మెంట్స్ దక్కించుకోబోతున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.


అక్రమ మార్గాల్లో వచ్చిన డబ్బును ఆయన రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారని సమాచారం. శాఖ వ్యవహారాలను పూర్తిగా గాలికొదిలేసి ఎంత సేపూ తనకు డబ్బులు ఎలా వస్తాయన్న దానిపై ఫోకస్ పెట్టి ఆ సంస్థను ఇప్పుడు దివాళా తీసే స్థాయికి తీసుకొచ్చారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది తప్ప..ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఆయనకు ఉన్న పరపతి దృష్ట్యా ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఆయన ప్రస్తుతం విజయవాడలో ఉంటున్న నివాసం కూడా అతి ఖరీదైనదిగా ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

tags : ap, minister, son in law

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info