A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ నిజంగానే ఈ హమీ నెరవేర్చుతుందా
Share |
September 23 2018, 10:45 am

అధికారంలోకి వస్తే చేస్తారో ,లేదో కాని హామీలు మాత్రం గుప్పిస్తున్నారు.కాంగ్రెస్ అదికారంలోకి వస్తే పెట్రోల్ ఉత్పత్తులను జిఎస్టి పరిదిలోకి తెస్తామని,తద్వారా పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గిస్తామని పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు.అప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని ఆయన చెప్పారు. రూపాయి ధర పతనం, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడానికి మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాల వైఖరే కారణమన్నారు. తెలంగాణలో 2014లో పెట్రోల్‌ ధర రూ.70లు ఉంటే నేడు ఆ ధర రూ.85లకు పెరిగిందన్నారు. డీజిల్‌ ధర అయితే నాడు రూ.55 ఉంటే నేడు రూ.79లకు చేరిందని విమర్శించారు. ప్రజలను ఇబ్బందులు పెడుతూ పెడుతూ అధిక పన్నులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్పీజీ సిలిండర్ విషయాన్ని పరిశీలిస్తే.. దాని ధర 2014తో పోలిస్తే రెట్టింపయిందని ఆయన అన్నారు.పెట్రోల్ ఉత్పత్తులను జిఎస్టిలోకి తేవడాన్ని దాదాపు అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.

tags : uttam, congress

Latest News
*రాఫెల్ డీల్- ఖండించిన ప్రాన్స్
*4 ఏళ్లు మోడీకి చంద్రబాబు ఊడిగం చేసినట్లా
*శివాజీ గొడవ ఏమిటో అర్దమే కాదు
*పురుగులు పడి చస్తారన్న మధుయాష్కి
*60 సీట్లలో బిసి అభ్యర్దులు- బిఎల్ ఎఫ్
*ఉత్తం బార్య సీటుకే టిడిపి ఎసరు!
*ఎపికి నూక్లియర్ పవర్ ప్లాంట్
*చైర్మన్ పదవి ఎందుకంటే- కోదండరామ్
*కాంగ్రెస్ ఎమ్.పిల మూకుమ్మడి రాజీనామా యోచన
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info