A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అప్పుడే జనసమితిలో తిరుగుబాట్లా
Share |
November 18 2018, 10:16 am

తెలంగాణ జనసమితి బలం ఎంతో తెలియదు.కాని అప్పుడే తిరుగుబాట్లు.ఆరోపణలు..ఏమి రాజకీయాలో!తెలంగాణ జనసమితి మహిళా విభాగం అద్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న తిరుగుబాటు చేశారు.పార్టీలో టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆమె ఆరోపించారు. టికెట్ల అమ్మకాన్ని, వసూళ్ల వ్యవహారాన్ని మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ నడుపుతున్నారని ఆరోపించారు. టీజేఎస్‌ రాజకీయపార్టీగా కాకుండా, వ్యాపార సంస్థగా నడస్తోందని విమర్శించారు. పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్లు వార్తలు రాయించారని, అది సరికాదన్నారు. టీజేఎస్‌లో దిలీప్‌తో పాటు మరో ఆరుగురు నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. దిలీప్‌కుమార్‌కు రూ.2 లక్షలు ఇచ్చానని, దీనికి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
టికెట్లను పార్టీ ఇంకా ఖరారు చేయలేదని, డబ్బుల వసూళ్లంటూ ఆరోపణలు చేయడం సరికాదని దిలీప్‌కుమార్‌ అన్నారు. పార్టీ అవసరాలకోసం ఒక ఎన్‌ఆర్‌ఐ నుంచి 1.8 లక్షలు తనకు అందిన విషయం వాస్తవమేనని, వాటికి సంబంధించిన అన్ని లెక్కలు తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు.

tags : tjs. revolt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info