A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీనే ప్రజాదరణ కలిగిన నేత
Share |
September 23 2018, 8:29 am

ఎన్నికలకు తాము సన్నద్దంగా ఉన్నామని బిజెపి ప్రకటించింది. 2022 నాటికి నవభారతం లక్ష్యంగా పనిచేస్తున్నామని బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం పేర్కొంది.ఈ మేరకు తీర్మానం చేశారు.దేశంలో ప్రధాని నరేంద్రమోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా బిజెపి తీర్మానంలో వ్యాఖ్యానించింది. విపక్షాలకు ఓ విధానం గానీ, నాయకుడు గానీ లేరని విమర్శించింది. కేవలం మోదీని ఓడించాలన్న విధానంతోనే విపక్షాలు పనిచేస్తున్నాయని తీర్మానం పేర్కొంది. బిజెపి ని ఓడించాలన్న వారి ప్రయత్నం పగటి కలగానే మిగిలిపోతుందని ఎద్దేవాచేసింది. నాలుగేళ్ల ఎన్డీయే పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందన్న ఈ తీర్మానం.. 2022 నాటికి దేశానికి ఉగ్రవాదం, కులతత్వం, మతత్వం నుంచి విముక్తి ప్రసాదించగలమని విశ్వాసం వ్యక్తం చేసింది.

tags : bjp,modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info