A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కంప్యూటర్ల కు అబద్దాలు నేర్పగలరు-జగన్
Share |
April 20 2019, 8:27 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంప్యూటర్లకు కూడా అబద్దాలు నేర్పగలరని విపక్ష నేత జగన్ ఎద్దేవ చేశారు. విశాఖలో ఆయన మాట్లాడారు.గతంలో విశాఖ ప్రగతి, ఇప్పటి ప్రగతిని ఆయన పోల్చారు.'ఐటీ రంగాన్ని పరిశీలిస్తే.. ఆ దివంగత నేత, నాన్నగారి హయాంలో దాదాపు 10 ఏళ్ల కిందటనే 18 వేల మందికి ఉద్యోగాలొచ్చాయి. ఆనాడే విశాఖ నగరం నుంచి రూ.2 వేల కోట్ల ఐటీ ఎగుమతులుంటే ఈ పెద్దమనిషి చంద్రబాబు హయాంలో నాలుగున్నరేళ్లలో 18 వేల ఉద్యోగాలు కాస్తా పెరగాల్సింది పోయి 16 వేలకు పడిపోయాయి. ఐటీ ఎక్స్‌పోర్ట్స్‌ నాన్నగారి హయాంలో రూ.2 వేల కోట్లుంటే.. 10 ఏళ్ల తర్వాత పెరగాల్సింది పోయి బాబు హయాంలో రూ.1145 కోట్లకు పడిపోయాయి. విశాఖలో ఆ విప్రో బిల్డింగ్‌ కన్పిస్తోంది. దాంట్లో ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆ బిల్డింగ్‌ కట్టిన పరిస్థితి. ఇవాళ అక్కడ 250 మంది కూడా సరిగ్గా పని చేయడం లేదు. ఇక ఐటీ స్పేస్‌ ఎంతుందో తెలుసా? మొత్తం ఐదు లక్షల ఐదువేల ఎస్‌ఎఫ్‌టీ స్థలం ఉంటే ఇందులో ఖాళీగా ఉన్నది అక్షరాల 4.27లక్షల ఎస్‌ఎఫ్‌టీ. ఈ పెద్దమనిషి హయాంలో ఇంతటి దారుణంగా ఐటీ రంగం ఉంటే కళ్లార్పకుండా అబద్దాలు చెప్పేస్తాడు. కంప్యూటర్లకు కూడా అబద్దాలు నేర్పగలడీ పెద్దమనిషి. అబద్దాలు చెప్పడంలో, మోసాలు చేయడంలో పీహెచ్‌డీ చేసిందెవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. "

tags : jgan, lies, chandrababu

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info