A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లక్షల ఉద్యోగాలు వచ్చాయని మోసం
Share |
November 18 2018, 10:00 am

లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విపక్ష నేత జగన్ విమర్శించారు. విశాఖలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
'విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సులు పెడతుంటారు. మూడు రోజుల పాటు మీటింగ్‌లు పెట్టి రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలొచ్చాయని చెబుతాడు ఈ పెద్దమనిషి (చంద్రబాబు). మీకెక్కడైనా కనిపించాయా? ఎన్ని వేల కోట్ల పరిశ్రమలొచ్చాయో తెలుసుకునేందుకు ఓ సంస్థ ఉంది. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియాలో డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఇండిస్ట్రీ పాలసీ అండ్‌ ప్రమోషన్‌.అందులో అన్ని వివరాలు ఉంటాయి. ఏ ఏ రాష్ట్రాలకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులొస్తాయో డిక్లేర్‌ చేస్తారు. ఈ సంస్థ లెక్కల ప్రకారం రాష్ట్రానికి ఏటా సగటున రూ.5 వేల కోట్లు కూడా రాలేదు. నాలుగేళ్లలో రూ.20 వేల కోట్లు కూడా రాలేదని ఆ డిప్‌ చెబుతా ఉంటే ఈ పెద్దమనిషి చంద్రబాబు మాత్రం రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు.. 40 లక్షల ఉద్యోగాలని చెప్పి మనందరి చెవుల్లో పువ్వులు పెడతారు. మూడు రోజుల ఈ సదస్సు నిర్వహించేందుకు అక్షరాల రూ.150 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ఈ రూ.150 కోట్లలో తిండి బిల్లు రూ.53 కోట్లు. అంటే ఏ స్థాయిలో దోచేస్తున్నారో చెప్పడానికి వేరే నిదర్శనం అక్కర్లేదు. "అని ఆయన అన్నారు.

tags : jagan, chadnrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info