A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్, టిడిపి దోస్తీ- ఇంత నీచమా
Share |
January 16 2019, 6:02 am

కాంగ్రెస్ ,టిడిపి పొత్తు పెట్టుకోవడం కన్నా నీచం మరొకటి ఉందా అని మంత్రి జూపల్లె కృష్ణారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ సిద్దాంతాలకు వ్యతిరేకంగా టిడిపి ఏర్పడిందని, కాని ఇప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తులకు దిగాయని ఆయన అన్నారు.కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు రాష్ట్రంలో 100కు పైగా సీట్ల లో టీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయమని, జీహెచ్‌ఎంసీ తరహాలో విజయదుందుభి మోగిస్తామని ఆయన జోస్యం చెప్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడింది చంద్రబాబేనని విమర్శించారు. పాలమూరును సస్యశ్యామలం చేసే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టిస్తున్న బాబును ఇక్కడి ప్రజలు నమ్ముతారా అని ఆయన అన్నారు.

tags : jupalle, congress, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info