A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు బ్రాహ్మణులు మద్దతు ఇవ్వాలి
Share |
November 18 2018, 8:52 am

తెలుగుదేశంపార్టీ మొదటి నుంచి బ్రాహ్మణులను ఇబ్బంది పెడుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. విశాఖలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో ఆయన మా్ట్లాడారు. విపక్షనేత వైఎస్ జగన్ ,మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు ,ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు హాజరైన ఈ సమావేశంలో మల్లాది విష్ణు మాట్లాడుతూ తొలి నుంచి బ్రాహ్మణులను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు.అర్చకులకు పదవీ విరమణ లేకపోయినా, టిటిడి నుంచి రమణ దీక్షితులను తప్పించిందని ఆయన అన్నారు.వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్పప్పుడు బ్రాహ్మణులకు విశేష ప్రాదాన్యత లబించిందని, వారి సంక్షేమానికి పెద్ద పీట వేశారని ఆయన అన్నారు.బ్రాహ్మణులకు వైఎస్ వెయ్యి కోట్ల ఖర్చు చేస్తే చంద్రబాబు అరకొర నిదులే వెచ్చించారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం నిలబడాలం టే వైఎస్‌ జగన్‌ను సీఎం చేయాలని అన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే దేవాలయ భూముల పరిరక్షణకు, బ్రాహ్మణ సంక్షేమానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. బ్రాహ్మణులంతా సంఘటితంగా ఉండి వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు.

tags : ysr congress, jagan ,brahmin

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info