A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో ఇంత అనుమానమా..చంపేశారే
Share |
January 16 2019, 5:29 am

అమెరికాలో మనిషిని,మరో మనిషి ఎంతగా అనుమానిస్తారా? వేరే వారి ప్లాట్ లోకి వెళ్లి ,అది తన ప్లాట్ అనుకుని అక్కడ ఉన్న వ్యక్తిని తుపాకితో కాల్చిన ఘటన జరిగింది.డలాస్ లో ఒక మహిళా పోలీస్ అదికారి తన ప్లాట్ అనుకుని వేరే వారి ప్లాట్ లోకి వెళ్లింది. అక్కడ ఒక వ్యక్తి కనిపించేసరికి, అతను దొంగ అనో, వేరే నేరానాకి వచ్చాడనో అనుమానించి,తన చేతిలో ఉన్న తుపాకీతో కాల్చేసింది.బోతమ్ జాన్ అనే ఇరవైఆరేళ్ల యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత ఆ మహిళ పోలీసు అదికారికి చేసిన తప్పు అర్దం అయింది. కాని అప్పటికే దారుణం జరిగిపోయింది.ఈ ఘటన తెలిసిన తర్వాత ఆమెను అధికారులు విదుల నుంచి తప్పించి విచారణ చేస్తున్నారు. ఆమె ఇంటికి వెళ్లినప్పుడు డోర్ తెరిసి ఉందా,లేదా?ఎలా వెళ్లారు? అన్న అంశాలపై విచారణ చేస్తున్నారు.

tags : america..murder

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info