A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మల్యే
Share |
July 20 2019, 2:02 am

తెలంగాణలో వలసలు ఊపందుకుంటున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి,టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి సాగుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరబోతున్నారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే ,కాంగ్రెస్ సీనియర్ నేత కోడూరి సత్యనారాయణ గౌడ్ టిఆర్ఎస్ లోకి చేరడానికి సిద్దమయ్యారు.ఆయనతో పాటు కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆకారపు భాస్కర్‌రెడ్డి కూడా పార్టీ మారడానికి సిద్దం అయ్యారని వార్తలు వచ్చాయి. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఈ విషయం తెలపగా, ఆయన ఓకే చేశారని అంటున్నారు. ఈ నెల పన్నెండున వీరిద్దరూ టిఆర్ఎస్ తీర్దం పుచ్చుకుంటారు.

tags : trs ,congress, goud, defections

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info