A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నటుడు శివాజీ ప్రయత్నం అదే..
Share |
April 20 2019, 8:22 pm

కాంగ్రెస్ ,తెలుగుదేశం పార్టీ ల పొత్తు విషయంపై ప్రజల దృష్టి మరల్సేందుకే నటుడు శివాజీ తలులుదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ లో మాట్లాడుతున్నారని బిజెపి విమర్శించింది. ఆపరేషన్ గరుడ అంటూ ఏవేవో మతి భ్రమించి శివాజీ మాట్లాడుతున్నారని ఆ పార్టీ అదికార ప్రతినిది కోట సాయికృష్ణ చెప్పారు. బిజెపి నాయకత్వంపై శివాజీ చేస్తున్నది తప్పుడు ప్రచారం అని ఆయన అన్నారు. ఐదు నెలల క్రితం శివాజీ ఇదే ఆపరేషన్‌ గరుడ గురించి మాట్లాడారు..అందులో ఏ ఒక్కటైనా నిజమైందా అని సూటిగా ప్రశ్నించారు.ఆపరేషన్‌ గరుడ అనేది బీజేపీపై తప్పుడు ప్రచారం చేసేందుకు ఎత్తుకున్న విషయమని, అది ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వేదికగా తయారు చేసిందని ఆరోపించారు. టీడీపీ కాంగ్రెస్‌ పొత్తు అపవిత్రమైంది..కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్‌ ఆత్మక్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో సోనియాను దెయ్యం అన్న చంద్రబాబు ఇప్పుడు అదే సోనియా గాంధీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు.

tags : bjp, sivaji

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info