A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ లా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లగలరా
Share |
April 21 2019, 11:41 am

దమ్ము,దైర్యం ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాదిరి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు సిద్దం అవుతారా అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐజయ్య సవాల్ చేశారు. చంద్రబాబు అవకాశవాదంతో రాజకీయాలను భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. 2014లో కాంగ్రెస్‌ పార్టీని తిట్టి బీజేపీతో దోస్తీ చేసి అధికారం చేపట్టిన చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీని తిట్టి కాంగ్రెస్‌తో దోస్తీకి సిద్ధం కావడం చూస్తే ప్రపంచంలోనే ఆయనంత అవకాశవాద రాజకీయ నాయకుడు ఇంకొకరు ఉండరన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే కేసీఆర్‌లాగా ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. వైఎస్సార్‌ చేసిన మేలు ముస్లింలు మరవరని, వారు ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ వెంటే ఉంటారన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు అందరూ గమనిస్తున్నారన్నారు.

tags : ijayya,

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info