A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్ధిక మంత్రిపై అయ్యన్న ఫైర్
Share |
September 22 2018, 2:36 am

ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడుపైన, ఆర్ధిక శాఖపైన రహదారుల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని కదనాలు వచ్చాయి.తమ శాఖ ప్రతిపాదించిన రెగ్యులర్ ప్రాజెక్టులకు ఆర్దిక శాఖ అభ్యంతరాలతో కొర్రీలు వేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్రమంలో నిధుల్లేకుండా రోడ్లుఎలా వేయాలంటూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో వాదనకు దిగారని సమాచారం. కొర్రీల మీద కొర్రీలు వేస్తూ శాఖ ప్రాజెక్టులను ఆపేశారని, ఏ పనీ చేయనప్పుడు తాను మంత్రిగా ఉండీ లాభమేంటని తీవ్ర ఆవేదన వ్యక్తంచేసినట్లు తెలిసింది. పని ఉన్నా చేయనివ్వడం లేదని, ఇలాంటప్పుడు మంత్రిగా ఉండి ఏం లాభమని.. వెళ్లిపోమంటారా అని ప్రశ్నించినట్లు వార్తలు సూచిస్తున్నాయి. త్వరలో ముఖ్యమంత్రితో సమావేశం నిర్వహించి ప్రాజెక్టుల నిధులపై స్పష్టత ఇస్తామని ఆయన్ను యనమల సముదాయించినట్లు కదనం.

tags : ayyanna, yanamala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info