A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సురేఖ దండం పెట్టి సీటు తీసుకుంది
Share |
November 18 2018, 8:56 am

మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులపై మాజీ ఎమ్.పి గుండు సుధారాణి మండిపడ్డారు.ఆమె పార్టీ మారదలచుకుంటే మారవచ్చు కాని ,ఏవో ఆరోపణలు చేయడం సరికాదని ఆమె అన్నారు.సురేఖ వెళ్లిపోయినా వరంగల్‌లో పార్టీకి వచ్చే నష్టమేమీ ఉండదన్నారు.
కొండా సురేఖ రెండు లేదా మూడు సీట్లు అడిగారని, పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నందునే.. ఆమె పార్టీ వీడాలని ఆలోచిస్తున్నారని సుదారాణి అన్నారు. 2014లో ఆమెను పిలిచి టికెట్‌ ఇవ్వలేదని, రాజకీయ బిక్ష కావాలని కేసీఆర్‌కు దండం పెడితే స్థానికేతరురాలు అయినప్పటికీ వరంగల్‌ తూర్పు నుంచి పోటీ చేయించి గెలిపించార ఆమె అన్నారు. కొండా దంపతులు ఏకచత్రాధిపత్యం కొనసాగిస్తూ నియోజకవర్గంలో అందరినీ ఇబ్బంది పెడుతున్నరని ఆమె అన్నారు. బీసీ మేయర్‌ను ఇబ్బంది పెట్టారని.. ఇప్పుడు భూపాలపల్లిలో మధుసూదనాచారి వంటి బీసీ నేతలకు ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సుదారాణి విమర్శించారు. టిఆర్ఎస్ లో గ్రూపులు ఉండవని,కెసిఆర్ నాయకత్వమే అందరికి శికోధార్యం అని ఆమె వ్యాఖ్యానించారు.

tags : trs, surekha

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info