A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం నాణ్యత లేకున్నా పట్టదా
Share |
November 14 2018, 9:55 am

పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతున్నా,నాణ్యత సరిగా లేదని అదికారుల కమిటీ వ్యాఖ్యానించినా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ ఆర్ కాంగ్రస్ అదికార ప్రతినిది పార్ధసారధి ప్రశ్నించారు. అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టును కేవలం ఆర్భాటానికి, ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు లోపాలకు కేంద్ర బృందం ఎత్తిచూపిందని ఆయన అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన స్పిల్‌వేలో గ్యాపులు ఉన్నాయి. కంకర తప్ప మరేమి కనబడడంలేదని వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.టీడీపీ-బీజేపీకి ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లనే బీజేపీ కళ్లు మూసుకుని ఉంది. వారిమధ్య ఉ‍న్న అనుబంధం ఏంటి?. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పోలవరం అవకతవకలపై విచారణ జరిపించాలి’’ అని పేర్కొన్నారు. 112.45 కోట్లు ఏలాంటి పనులు జరగకుండా దోచుకున్నారని ఆయన ఆరోపించారు.

tags : pardhasaradhi, polavaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info