తెలంగాణలో టిక్కెట్లు రాని ఆశావహులు స్వతంత్రులుగా బరిలో దిగడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా ఖానాపూర్ నియోజకవర్గంలో టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్.పి రమేష్ రాధోడ్ స్వతంత్రుడిగా పోటీచేస్తానని అంటున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ రావడంతో ఆయన నిరాశకు గురయ్యారు. కేసీఆర్ వచ్చి ఖానాపూర్లో పోటీ చేసినా తను విజయాన్ని ఆపలేరని రమేశ్ రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు. ఖానాపూర్ నియోజకవర్గ టికెట్ ఇస్తామని కేసీఆర్ చెప్పడంతోనే తాను ఈ పార్టీలో చేరానని ఆయన అన్నారు.ఇప్పటికైతే ఏ పార్టీలోనూ చేరాలనే ఆలోచన లేదని, అనుచరుల అభీష్టం మేరకు భవిష్యత్ ప్రణాళిక ఉంటుందని ఆయన వివరించారు. మాజీ మంత్రి కొండా సురేఖ కూడా ఇండిపెండెంట్ గా పోటీచేయడానికి కూడా సై అన్న సంగతి తెలిసిందే. tags : telangana, independent