A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ముందుగా పెట్రోల్ టాక్స్ తగ్గించాలి
Share |
November 18 2018, 9:44 am

తెలుగుదేశం పార్టీ ముందుగా ఎపిలో అదనంగా పెట్రోల్ ,డీజిల్ పై విధిస్తున్న పన్నును తగ్గించి అప్పుడు భారత్ బంద్ లో పాల్గొనాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. విజయవాడలో పెట్రోల్,డీజిల్ దరలకు నిరసనగా ఆ పార్టీ ఒక కార్యక్రమం చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఈ విషయంలో ప్రజలను మోసం చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఒక ఆటోకి తాడు కట్టి లాగి వారు నిరసన తెలిపారు. పెట్రోల్‌పై రాష్ట్రం విధిస్తున్న పన్నులు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లీటర్‌ పెట్రోల్‌పై చంద్రబాబు సర్కార్‌ రూ. 4 భారం మోపుతోందని పేర్కొన్నారు.కేంద్రంలో బీజేపీతో కలిసి నాలుగేళ్లుగా ప్రజలపై పన్నుల భారాన్ని మోపి, ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పెట్రో రేట్లు తగ్గించాలని నిరసన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. పెట్రో పన్నులు తగ్గించకుండా బంద్‌లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు.

tags : ysr congress, petrol,tax

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info