A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో కాంగ్రెస్ తో పొత్తుకు నో-చినరాజప్ప
Share |
September 22 2018, 2:37 am

తెలంగాణలో సంగతి ఎలా ఉన్నా ఎపిలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తు ఉండదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. తెలంగాణ పొత్తు విషయమై ఇక్కడ ఏమీ మాట్లాడలేమని ఆయన అన్నారు. తమ నేత చంద్రబాబు నాయుడు నిర్ణయం ప్రకారం జరుగుతుందని ఆయన చెప్పారు.అయితే ఆంద్రప్రదేశ్ లో మాత్రం ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని ఆయన అన్నారు.అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఇంకా కాంగ్రెస్ పార్టీ వాసన పోలేదని, అందువల్లే అధికార పార్టీలో ఉంటూనే పోలీసు వ్యవస్థ మీద ఆరోపణలు చేస్తున్నారన్నారని చినరాజప్ప వ్యాఖ్యానించారు.

tags : china rajappa, ap, congress, alliance

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info