A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు ఓకే - అఫీషియల్
Share |
April 20 2019, 8:20 pm

కాంగ్రెస్ తో సహా కలిసి వచ్చే ఇతర పార్టీలతో పొ్త్తు పెట్టుకోవడానికి టిడిపి అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని టిడిపి తెలంగాణ శాఖ అద్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ తో పొత్తును అర్దం చేసుకుంటాయని ఆయన అన్నారు టిఆర్ఎస్ ,బిజెపిలను వ్యతిరేకించేవారంతా ఒకటి కావాలని ఆయన సూచించారు.మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఉంటుందని, అయితే ఇందులో కొందరు సర్దుకోకతప్పదని ఆయన అన్నారు.కాగా ఎన్నికల కమిటీ,ప్రచార కమిటీ,మానిపెస్టో కమిటీలను కూడా వేస్తున్నట్లు ప్రకటించారు. దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖరరెడ్డి, అరవింద్ , గిరకపాటి మోహన్ రావు, దయాకరరెడ్డి తదితరులు ఈ కమిటీలలో సభ్యులుగా ఉన్నారు.చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రమణ వెంటనే పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డికి పోన్ చేసి సంప్రదింపులు ఆరంభించారు. రేపు సాయంత్రం వీరిద్దరూ భేటీ కానున్నారు.

tags : congress, tdp, alliance

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info