A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.టిడిపి నేతలకు చంద్రబాబు సలహా
Share |
July 20 2019, 2:01 am

ఒక్క కాంగ్రెస్ తోనే పొత్తు కడుతున్నట్లుగా కనిపించకుండా, మరికొన్ని ఇతర పార్టీలతో కూడా పొత్తుకు ప్రయత్నాలు చేయాలని ఎపి ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ టిడిపి నేతలతో ఆయన ఆదివారంనాడు కూడా సంప్రదింపులు కొనసాగించారు. కొందరు నేతలు పొత్తు వద్దని సూచించగా, పొత్తు లేకుండా ఒక్కరైనా గెలుస్తారా అని ఆయన ప్రశ్నించారట. పార్టీని తెలంగాణలో కాపాడుకోవాలంటే పొత్తులు తప్పవు.. అందుకు తగ్గట్టుగా రెడీగా ఉండాలని ఆయన అన్నారు. ఒక్క కాంగ్రెస్‌తోనే పొత్తు అంటే పార్టీ సిద్దాంతాలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, జనసమితి ఇతర పార్టీలతో కూటమి కట్టేలా సమాలోచనలు చేయాలని టీటీడీపీ నేతలకు చంద్రబాబు చెప్పారని, త్వరగా ఈ పని పూర్తిచేయాలని ఆయన అన్నారని వార్తలు వస్తున్నాయి.

tags : chandrababu, congress, alliance

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info