A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ ముఖ్యమంత్రి సతీమణి కన్నుమూత
Share |
January 16 2019, 4:34 am

మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య సతీమణి, మాజీ ఎమ్.పి, మాజీ ఎమ్మెల్యే మణెమ్మ దివంగతులయ్యారు. ఆమె వయసు డెబ్బైనాలుగేళ్లు. గత కొంతకాలంగా ఆమె అస్వస్తురాలిగా ఉన్నారు.మణెమ్మ గతంలో సికింద్రాబాద్ నుంచి రెండుసార్లు ఎమ్.పిగా ఎన్నికయ్యారు. తదుపరి ఒకసారి ముషీరాబాద్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఆమె మృతికి సంతాపం తెలిపారు.అంజయ్య కుటుంబం కాంగ్రెస్ కు ఎంతో సేవ చేసిందని వారు అన్నారు.

tags : manemma,died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info