A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు ఒవైసీ సూటి ప్రశ్నలు
Share |
April 23 2019, 4:08 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎమ్.ఐ.ఎమ్. అదినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలే చేశారు.ఆయన గతంలో బిజెపి హయాంలో మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు, గోరక్షణ పేరుతో హత్యలు జరుగుతున్నప్పుడు బిజెపితో కలిసి పవర్ ఎంజాయ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారని ఒవైసీ మండిపడ్డారు. ఒక మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు..

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోరాడుతున్నాయి. ఇది ఎంతవరకు ఫలిస్తుంది?

అసదుద్దీన్: టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా. మరి ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారు? ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ స్ఫూర్తి ఇప్పుడు ఎక్కడికి పోయింది?. చంద్రబాబు మొన్నటివరకు బీజేపీకి మిత్రుడిగా ఉన్నారు. అప్పుడు సెక్యులరిజం గుర్తుకు రాలేదా?. ఆయన బీజేపీని ఎందుకు వదిలేశారు. సెక్యులరిజం కోసమా? బీజేపీ ప్రభుత్వం గోరక్షణ పేరుతో ఇక్లాఖ్‌ను చంపినప్పుడు, జైనైద్‌ను రైలులో చంపినప్పుడు చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు. గోరక్షణ పేరుతో మైనార్టీలను చంపారు. దళితులపై దాడులు జరిగినప్పుడు చంద్రబాబు ఏం చేశారు. అప్పుడు టీడీపీ కేంద్ర మంత్రివర్గంలో అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఆయన సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు. గుజరాత్ మతకలహాల సమయంలోనూ చంద్రబాబు కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి నాలుగేండ్లలో ఆ రాష్ర్టానికి ఏమీ చేయలేని చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు?. ఏపీలో రాజధానిని నిర్మించలేకపోయారు, తాత్కాలిక సచివాలయంలో తన క్యాబిన్‌లోకే వాననీరు వస్తే ఏమీ చేయలేకపోయారు. నేను చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా... నీవు, నీ కొడుకు కలిసి హైదరాబాద్‌లో పోటీ చేయండి. మేం కూడా పోరాడుతాం. ఎవరి శక్తి ఏమిటో తేలిపోతుంది. టీడీపీకి మిగిలిన కొంత బలం కూడా గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. టీఆర్‌ఎస్ హయాంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజలు ఎలాంటి వివక్ష లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు. సెటిలర్లు.. ఆంధ్రావాళ్లు అని ఎవరైనా అంటున్నారా? తెలంగాణ ప్రజలుగా చూశారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. పౌరుల్లో అభద్రత లేదు. మత కలహాలు అసలే లేవు. ఇంకా ఏం కావాలి. టీఆర్‌ఎస్ ఇంకా అభివృద్ధి చేయాల్సింది అని చెప్పగలుగుతామే తప్ప.. ఎలాంటి లోటూ లేదు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు వల్ల ఒరిగేదేమీ ఉండదు. వాళ్లు ప్రజలకు ఏం చెప్తారు?. ఏపీలో కాస్తో కూస్తో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీడీపీతో పొత్తువల్ల అక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. తెలంగాణలో నిండా మునిగిపోతుంది. ఎన్నికల్లో రెండు పార్టీలకు ఘోర పరాభవం తప్పదు.

tags : owaise, chandrababu, questions

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info