తన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ మాటలను అన్న, ఎమ్.ఐ.ఎమ్. అదినేత అసదుద్దీన్ ఒవైసీ తోసిపుచ్చారు. కర్నాటక మాదిరి రాజకీయం ఇక్కడ ఉండదని, ముఖ్యమంత్రి కెసిఆర్ మళ్లీ సి.ఎమ్. అవుతారని స్పష్టంగా చెప్పడం విశేషం.అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని, తిరిగి ఆ పార్టీకే అధికారం కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య అనైతిక పొత్తును తెలంగాణ ప్రజలు తిప్పికొడుతారని, రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు నిండా మునుగడం ఖాయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో ఏమీ చేయలేని చంద్రబాబు.. తెలంగాణకు వచ్చి ఏం ఒరుగబెడుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజాకర్షక బలం ముందు ఈ రెండు పార్టీలు ఎదురునిలువలేవన్నారు. ఎంఐఎంకు సీఎం పదవి, ఇతర పదవులపై ఆశలేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఉన్న సీట్లను కాపాడుకోవడంతోపాటు బలాన్ని పెంచుకోవడంపైనే దృష్టిసారించామని, తమకు మరో లక్ష్యం లేదని ఆయన చెప్పారు. tags : asad, comment