A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డి.ఎస్.పై అనర్హత వేటుకు టిఆర్ఎస్ యోచన
Share |
November 14 2018, 8:42 am

సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పై అనర్హత వేటు వేయడానికి రంగం సిద్దం అవుతోందని వార్తలు వస్తున్నాయి. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరవచ్చని వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ లో చేరి, తన పదవికి రాజీనామా చేయకపోతే అనర్హత వేటు వేయాలని టిఆర్ఎస్ కోరవచ్చు.అలాకాకపోయినా డి.ఎస్ ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద అనర్హుడిని చేయాలన్న ఆలోచన కూడా సాగుతోందట. ఇందుకు అవసరమైన ఆధారాలను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ నేతలు ఢిల్లీలో సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. డీఎస్‌ ఎంపీ పదవీకాలం 2022 వరకు ఉంది.

tags : ds, disqualify

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info