A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సీటు వస్తుందనుకున్న గుత్తాకు నిరాశ
Share |
November 16 2018, 4:16 am

రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలన్న తాపత్రయంతో టీఆర్‌ఎస్‌లో చేరిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారని కధనాలు వస్తున్నాయి. నల్లగొండ జిల్లా మునుగోడు లేదా మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని ఆయన ఆశించారట. ఈ రెండు చోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తనకు ఏదో ఒక చోట టికెట్‌ వస్తుందని గట్టిగా విశ్వసించారు. ఎంపీగా రాజీనామా చేస్తే ఎమ్మెల్సీగా రంగప్రవేశం చేసి మంత్రి కావాలన్న ఉద్దేశంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అప్పటి సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు తనకు అనుకూలంగా ఉండే రెండు నియోజకవర్గాలు కాదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేయాలని కోరడంతో గుత్తా తీవ్ర మనస్తాపం చెందారు. ఆ నియోజకవర్గం పూర్తిగా కొత్త కావడం, అందులోనూ ఉత్తమ్‌కుమార్‌కు బలమైన నియోజకవర్గం కావడంతో అక్కడ నుంచి పోటీ చేస్తే రాజకీయ భవిష్యత్‌ ఉండదని భావించి, తనకు టికెట్‌ వద్దని చెప్పారు.ప్రస్తుతం రైతు సమన్వయ సమితుల చైర్మన్ గా గుత్తా ఉన్నారు.

tags : gutta, seat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info