A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
7వ క్లాస్ పాస్ కాలేదు-1200 కోట్ల మోసం
Share |
April 21 2019, 11:43 am

ఏడో తరగతి కూడా పాస్ కాని ఒక వ్యక్తి 1200 కోట్ల రూపాయల మోసం చేయగలగడం ఏమిటి?దారుణం కాకపోతే!మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో పెద్ద ఎత్తున ఇతగాడు జనాన్ని మోసం చేశాడు. హర్యానాకు చెందిన రాధేశ్యామ్ అనే ఈ వ్యక్తి మరో ఇద్దరితో కలిసి ఈ మోసాలకు పాల్పడ్డాడు.‘మీరు రూ.7,500 చెల్లిస్తే చాలు... రూ.2,500 ఫీజును మినహాయించి రూ.5 వేలకు డ్రెస్సులు లేదంటే ఆరోగ్యకర ఉత్పత్తులిస్తాం. మీరు మరో ఇద్దరు సభ్యులను చేర్పిస్తే రూ.500 బోనస్‌తో పాటు రెండేళ్ల పాటు నెలకు రూ.2,500 అంటే రూ.60,000 సంపాదించుకోవచ్చు’అంటూ దేశవ్యాప్తంగా లక్షల మందికి ఆశచూపి
జనాన్ని మోసం చేశాడు.పోలీసులు రాధేశ్యామ్ ను, సురేందర్ సింగ్ ను అరెస్టు చేయగా ,బన్సీలాల్ అనే వ్యక్తి పారిపోయాడు.వీరికి చెందిన ఆరు బ్యాంక్‌ ఖాతాల్లోని రూ.200 కోట్లను పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. 2015లో ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌ కేర్‌ గ్లోబల్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీ పెట్టి ఈ మోసాలకు పాల్పడ్డారు.

tags : mlm,cheating

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info