A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపికి అసలు సిద్దాంతం ఉందా..వైసిపి ప్రశ్న
Share |
September 22 2018, 3:03 am

తెలుగుదేశం పార్టీకి ఒక సిద్దాంతం లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు. టిడిపి లౌకిక పార్టీనా,మతతత్వ పార్టీనా అన్నది తెలియకుండా రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు. 1995 నుంచి ఇంతవరకు ఆ పార్టీ పొత్తులు లేకుండా ఎన్నడూ పోటీ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. దమ్ముంటే పొత్తులు లేకుండా తాము పోటీచేస్తామని చంద్రబాబు చెప్పగలరా అని సవాల్ చేశారు. 1996 లోక్ సభ ఎన్నికలలో వామపక్షాలతో కలిసి పోటీ చేశారని, 1999 లో బిజెపితో పెట్టుకున్నారని ఆయన అన్నారు. వామపక్షాలతో ఉన్నప్పుడు బిజెపిని మత తత్వ పార్టీ అని అన్నారని ఆయన గుర్తు చేశారు.తిరిగి ఆయన అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు.2004 లో ఓటమి తర్వాత 2009 లో టిఆర్ఎస్, వామపక్షాలతో కలిసి పోటీ చేశారని, అప్పుడు మళ్లీ బిజెపిని విమర్శించారని ఆయన పేర్కొన్నారు.బిజెపితో కలిసినప్పుడు వామపక్షాలను వృధా పార్టీలుగా అబివర్ణించేవారని ఆయన అన్నారు.అలాగే మోడీని విమర్శించిన చంద్రబాబు 2014 ఎన్నికల కు ముందు ఆయన ముందు సాగిలపడ్డారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవ చేశారు.ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తుకు తహతహలాడుతున్నారని ఆయన చెప్పారు. గతంలో కాంగ్రెస్ ను చంద్రబాబు ఎంత చండాలంగా తిట్టింది వివరించే పేపర్ క్లిపింగ్ లను ఆయన చూపించారు.

tags : gadikota, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info