A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తిరిగి కాంగ్రెస్ గూటికి సమరసింహారెడ్డి
Share |
April 21 2019, 12:02 pm

మాజీ మంత్రి డి.కె. సమరసింహారెడ్డి తిరిగి కాంగ్రస్ తీర్ధం పుచ్చుకున్నారు. 1994 వరకు రాజకీయాలలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న సమరసింహారెడ్డి తన సోదరుడు భరతసింహారెడ్డితో విబేధాలు వచ్చినప్పటి నుంచి రాజకీయంగా వెనుకబడి పోయారు. ఆ తర్వాత మాజీ కేంద్ర మంత్రి ఆలే నరేంద్రతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తదుపరి కొద్దికాలం టిఆర్ఎస్ లో కొనసాగారు. అక్కడ కూడా ఇమడలేకపోయారు.తదుపరి ఆయన టిడిపిలో చేరారు. కాని ఆయనకు చంద్రబాబు గద్వాల టిక్కెట్ ఇవ్వకపోవడంతో అసంతృఫ్తికి గురయ్యారు. దాంతో గత కొన్ని సంవత్సరాలుగా ఆయన రాజకీయంగా అంత చురుకుగా లేరు. అయితే తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. ఆయన మరదలు ,ఇంతవరకు ఎమ్మెల్యే గా ఉన్న డి.కె. అరుణ ఈ విషయమై స్పందిస్తూ అంతా కలిసి పని చేస్తామని ముక్తసరిగా చెప్పారు.

tags : congress, samara

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info