తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి కెటిఆర్ అన్నారు. దీనిపై పాజిటివ్ గా ఎందుకు చూడడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం ఏర్పడిందని,టిఆర్ఎస్ టిక్కెట్లు కూడా ప్రకటించేసిందని, ఈ తరుణంలో సురేష్ రె్డ్డి పార్టీలో చేరుతున్నారంటే అర్దం చేసుకోవాలని కెటిఆర్ అన్నారు.సురేష్ రెడ్డి ఇంటికి కెటిఆర్ వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత ఆయన తో కలిసి మాట్లాడారు. tags : ktr, suresh reddy