A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు నోటీసు రాబోతోందా!
Share |
April 21 2019, 11:57 am

గతంలో ఆపరేషన్ గరుడ అంటూ ప్రచారం చేసిన నటుడు శివాజీ అది తుస్సుమన్నా, మళ్లీ రంగంలోకి దిగి కొత్త విషయం చెబుతున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్రం నోటీసు ఇవ్వబోతోందని ఆయన చెబుతున్నారు. ఆపరేషన్ గరుడ మరో రూపం దాల్చిందని ఆయన అంటున్నారు.ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తే అది రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం అని ఆయన తేల్చారు. జాతీయస్థాయిలోని రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి సోమవారం చంద్రబాబుకు నోటీసులు వస్తాయని ఆయన అంటున్నారు. ఈ విషయం తనకు అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం అని ఆయన అన్నారు.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా, తాను ఇలాగే చెబుతానని ఆయన ముక్తాయించారు. చంద్రబాబును తొలగించడానికి సమయం చూసి జాతీయ పార్టీ పంజా విప్పిందని ఆయన చెబుతున్నారు. మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి.

tags : sivaji, babu,notice

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info