A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ రెండు పార్టీలు కలిసే జగన్ పై కుట్ర చేశాయని..
Share |
September 21 2018, 8:22 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్న తీరు గమనిస్తే, రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఈ రెండు పార్టీలు కలిసే జగన్ పై కేసులు పెట్టడం కుట్రలో భాగమేనని అర్దం అవుతుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.చంద్రబాబుకి అటు బీజేపీ,ఇటు కాంగ్రెస్‌ పార్టీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.ఆయన మాత్రం అందరిపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తుంటారని పెద్దిరెడ్డి ద్వజమెత్తారు. చంద్రబాబు ఎన్నిరంగులైనా మార్చగల సమర్ధుడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీని పాతరేయాలి, తరిమేయాలి అన్న చంద్రబాబు ఈ రోజు పొత్తుపెట్టుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.చంద్రబాబు సిగ్గు లేకుండా కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

tags : peddireddy, jagan, congress, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info