A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ లో చేరిన నటుడు
Share |
November 18 2018, 9:23 am

తెలుగు టీవీ,సినిమా నటుడు జెఎల్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆయన మైకోర్టు ఆడ్వకేట్ గా కూడా ఉన్నారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో ఆయన టిఆర్ఎస్ లో చేరారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు చెందిన తాను గత 30 సంవత్సరాలుగా నగరంలో నివాసం ఉంటూ సుమారు 200 పైగా సినిమాలు, ఎన్నో సీరియల్స్‌లో విభిన్న పాత్రలు చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, బంగారు తెలంగాణ కోసం ఆయన వేస్తున్న బాటలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు పేర్కొన్నారు.ఒక కళాకారుల బృందంతో తాను తెలంగాణ అంతటా ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు.

tags : trs, jl srinivas

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info