A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ మాట నేనెక్కడ అన్నా...జానా ప్రశ్న
Share |
April 21 2019, 11:59 am

ముఖ్యమంత్రి కెసిఆర్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు.రైతులకు ఇరవైనాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే తాను గులాబీ జెండా కప్పుకుంటానని అన్నట్లుగా కెసిఆర్ హుస్నాబాద్ సభలో ఆన్నారని,తాను ఎప్పుడూ అలా అనలేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు.అసెంబ్లీలో తాను అనని మాటలను అన్నట్లు చెబుతున్నారని , గులాబీ జెండా కప్పుకుంటానని తాను అన్నట్లు ఉంటే.. ఆ రికార్డులు తెప్పించి ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌ చేశారు. తాను అన్నట్లు రుజువు చేస్తే 24 గంటల్లోనే అస్త్ర సన్యాసం చేస్తానని ఆయన పేర్కొన్నారు. 24 గంటల్లోగా కేసీఆర్‌ రుజువు చేయాలని, లేకపోతే వెంటనే క్షమాపణ చెప్పాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.

tags : jana, kcr

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info