A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎర్రబెల్లికి ఇస్తారు..నాకు ఇవ్వరా-కొండా సురేఖ
Share |
November 15 2018, 1:25 pm

మాజీ మంత్రి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ నిరసన గళం విప్పారు. తనకు టిక్కెట్ ఇవ్వకుండా మహిళలను ,బిసిలను టిఆర్ఎస్ అవమానించిందని ఆమె ఆరోపించారు.తాను టిఆర్ఎస్ నుంచి ఎలాంటి రాజకీయ లాభం పొందలేదని, పార్టీ అభివృద్ది కోసమే పనిచేశానని ఆమె అన్నారు .ఎర్రబెల్లి దయాకరరావుకు టిక్కెట్ ఇచ్చి తనకు ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ గుర్తుపైనే గెలిచిన తాము చేదు అయ్యామని... కానీ టీడీపీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎందుకు తీపి అయ్యారని ఆమె అన్నారు. ఎర్రబెల్లికి తనకు పడదని తెలిసినప్పటికీ ఆయన్ని టీఆరెస్‌లో చేర్చుకున్నారని, ఈ విషయంలో తమను కనీసం సంప్రదించలేదని ఆవేదన చెందారు. తాము రెండు సీట్లు అడిగామనడం అబద్ధమని... తమను పొమ్మనలేక పొగబెట్టారని ఆమె అన్నారు. భూపాలపల్లి టిక్కెట్ మదుసూదనాచారికి ఇవ్వకపోతే తమకు ఇవ్వాలని కోరామన్నారు. తమ క్యాడర్‌ కోరితేనే తాము భూపాలపల్లి వెళ్లినట్లు ఆమె చెప్పారు. టీఆర్‌ఎస్‌ పెద్దలు చెప్పే సమాధానంపై తమ భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని, అవసరమైతే మూడు చోట్ల ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.కెటిఆర్ వల్లే టిక్కెట్ రాలేదని ఆమె అబిప్రాయపడ్డారు.

tags : surekha, errabelli

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info