A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిజం చెప్పి ఇరుకునపడ్డ మంత్రి సునీత
Share |
February 19 2019, 1:49 pm

నిజం చెబితే ప్రభుత్వానికి ఇబ్బందే కదా..మహిళా , శిశు సంక్షేమ శాక మంత్రి పరిటాల సునీత ఎపిలో డ్వాక్రా మహిళల రుణాల మాఫీపై ఇచ్చిన సమాధానం ప్రభుత్వాన్ని ఇరుకు పడేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని స్త్రీ,శిశు సంక్షేమ, సెర్ప్, మహిళా సాధికారిత మంత్రి పరిటాల సునీత ఒక ప్రశ్నకు సమాదానంగా చెప్పారు. 2014–15, 2015–16, 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్వాక్రారుణాల మాఫీ మొత్తం ఎంత? జిల్లాల వారీగా వివరాలు ఇవ్వాలని, రాష్ట్రంలో 2014 జూన్‌ నాటికి మిగిలి ఉన్న డ్వాక్రా రుణాల మొత్తం ఎంత, ఇప్పటి వరకూ మాఫీ చేసిన రుణాల మొత్తం ఎంత, డ్వాక్రా రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదన ఉందా? అయితే ఆ వివరాలు ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు పాముల పుష్ప శ్రీవాణి, ఆర్‌కే రోజా, గౌరు చరితారెడ్డి రాతపూర్వకంగా ప్రశ్నించారు. దీనికి మంత్రి సునీత సమాధానమిస్తూ.. 2014 నుంచి 2018 వరకూ ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదని, డ్వాక్రా రుణాల మొత్తం రూ. 11,069 కోట్లు ఉన్నాయని, దీనికి ఒక్క పైసా కూడా మాఫీ కింద చెల్లించలేదని, దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనా కూడా లేదని జవాబిచ్చారు. అయితే మహిళలకు పసుపు కుంకుమల కింద ఒక్కొక్కరికి రూ.10 వేలు ప్రకటించామని, ఇప్పటికే రూ.8 వేలు ఇచ్చామన్నారు.అయితే ఈ ప్రశ్నను ఇలా అనుమతించి సమాధానం చెప్పడంపై టిడిపి ఎమ్మెల్యే వెంకటేష్ ఆక్షేపించారు. ప్రతిపక్ష సభ్యులు కావాలని ఈ ప్రశ్న వేశారని ఆయన అన్నారు.

tags : paritala sunita

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info