A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ పై ఆ దేవుడికి కోపం వస్తుందట
Share |
April 21 2019, 11:36 am

ఒక్కొక్కరిది ఒక్కో డిమాండ్..లేకుంటే ఎన్నికల సమయంలో శాపనార్దాలు పెడుతుంటారు. భద్రాచలం ఆలయ అబివృద్దిని ముఖ్యమంత్రి కెసిఆర్ విస్మరించారని, అందువల్ల రాముడి ఆగ్రహానికి కెసిఆర్ గురి అవుతారని అంతర్జాతీయ గాంధీపథం అధ్యక్షుడు డాక్టర్‌ బూసిరెడ్డి శంకరరెడ్డి వ్యాఖ్యానించారు. భద్రాద్రి రాముడిని తెలంగాణ దేవుడు అని గతంలో కెసిఆర్ అన్నారని, వంద కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారని ,కాని ఆ తర్వాత అభివృద్దిని పట్టించుకోలేదని ఆయన అంటున్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన భద్రాచలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో అభివృద్ది కొరవడిందని ఆయన అన్నారు. దేశంలోనే ప్రముఖ అధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న భద్రాచలాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన సీఎం కేసీఆర్‌ రానున్న ఎన్నికల్లో భద్రాద్రి రామయ్య కోపాగ్నికి గురికాక తప్పదని హెచ్చరించారు. విశేషం ఏమిటంటే భద్రాచలంలో అసలు దేవుడిపై గురి లేని సిపిఎం వారు దశాబ్దాల తరబడి గెలుస్తుడడం.

tags : bhadrachalam, kcr,

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info