A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పుష్కర తొక్కిసలాట మరణాలు-అలా తేల్చేశారా
Share |
January 22 2019, 4:07 am

గోదావరి పుష్కరాలపై ప్రబుత్వానికి ఇబ్బంది లేకుండానే నివేదిక వచ్చినట్లు కనిపిస్తుంది. రాజమండ్రి వద్ద పుష్కరాల ఆరంభంలో తొక్కిసలాట కారణంగా ఇరవైతొమ్మిది మంది మరణించారు. దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఐపి ఘాట్ కాకుండా సాధారణ భక్తులు వినియోగించే ఘాట్ కు రావడం, అక్కడ షూటింగ్ కు అనుమతి ఇవ్వడం వంటి కారణాల వల్ల తొక్కిసలాట జరిగిందని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీనిపై కేసు కూడా పెట్టలేదన్న వ్యాఖ్యలు వచ్చాయి. ప్రభ/త్వం ఒక రిటైర్డ్ జడ్జి సివి సోమయాజులుతో కమిషన్ ను వేసినట్లు ప్రకటించింది. ఆ కమిషన్ నివేదిక ఇప్పుడు ప్రభుత్వానికి రాగా ,దాని గురించి మంత్రి మండలిలో ప్రస్తావన వచ్చిందట. ఒకే ముహూర్తానికి ఎక్కువమంది పుష్కర స్నానం చేయడంతో రద్దీ ఏర్పడి పుష్కరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుందని కమిషన్‌ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొందట. ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోతే ఏలా చేశారో చూడండి..

tags : ap, pushkaras, deaths,commission report

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info