A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిక్కెట్ల ప్రకటన తర్వాత టిఆర్ఎస్ లో చేరుతున్నా
Share |
April 25 2019, 2:05 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన వద్దకు మంత్రి కెటిఆర్ ను పంపించడంపై మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా అబివృద్ది నిశ్శబ్ద విప్లవం మాదిరి సాగుతోందని, ప్రభుత్వ పదకాలు సాగుతున్న తీరు తనకు నచ్చిందని, వీటిని ముందుకు తీసుకు వెళ్లడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు.తన రాజకీయ అనుభవంతో ఈ మాట చెబుతున్నానని అన్నారు. 1989 నుంచి తనకు కెసిఆర్ తో పరిచయం ఉందని, అప్పటి నుంచి ఆయన ఆలోచన విదానం తనకు తెలుసునని ఆయన అన్నారు. టిక్కెట్లు కూడా ప్రకటించిన తర్వాత తాను టిఆర్ఎస్ లో చేరడానికి కారణం అబివృద్దిపై ఉన్న నమ్మకమేనని, రాజకీయ లబ్ది కోసం కాదని సురేష్ రెడ్డి అన్నారు.టిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ప్రజలకు, ప్రభుత్వానికి మద్య రాయబారిగా ఉంటానని ఆయన అన్నారు.కెసిఆర్ ఆహ్వానాన్ని తాను సమ్మతిస్తున్నానని ఆయన అన్నారు. అభివృద్ది కుంటుపడకుండా ఉండడానికే ఈ నిర్ణయం తసుకున్నానని అన్నారు.

tags : kcr, suresh reddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info