A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఫిరాయింపులపై కెసిఆర్ ను తప్పుపట్టిన లోకేష్
Share |
November 18 2018, 9:01 am

ఎపి ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ మళ్లీ జాగో,బాగో అంటూ కామెంట్లు చేస్తున్నారని ఆయన అన్నారని కదనాలు వస్తున్నాయి.ఒక పక్క తెలుగువారంతా కలిసి ఉండాలని అంటున్న కెసిఆర్ ఇలా మాట్లాడవచ్చా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లో టీడీపీ వాళ్లు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసునని లోకేష్‌ వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్‌ తన పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు.కెసిఆర్ టిడిపి ఎమ్మెల్యేలను ఆకర్షించిన వైనాన్ని ఆయన ఆక్షేపిస్తున్నారన్నమాట. నిజంగానే లోకేష్ పిరాయింపులను తప్పుపడితే మంచిదే.మరి అదే సమయంలో ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచిన 23 మందిని చంద్రబాబు తన పక్కన కూర్చోబెట్టుకున్న సంగతి లోకేష్ మర్చిపోయారనుకోవాలి. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకోకుండానే జీహెచ్‌ఎంసీ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ చేజిక్కించుకుందా అని ప్రశ్నించారు.

tags : lokesh, comments, kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info