A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తల్లి ,కొడుకులకు కాంగ్రెస్ టిక్కెట్లు!
Share |
September 22 2018, 6:34 am

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డికి ఈసారి రెండు అసెంబ్లీ సీట్లు కేటాంచే అవకాశం ఉంది.కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జాబితాలో వీరి పేర్లు ఉన్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. గతసారి కార్తీక్ రెడ్డి లోక్ సభకు పోటీచేయగా, సబిత పోటీచేయలేదు. ఈసారి ఇద్దరూ పోటీచేయవచ్చు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఆందోల్ నుంచి,మాజీ పిసిసి అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జనగామ నుంచి పోటీచేస్తారు. కాగా టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన సీతక్కకు ములుగు సీటు కేటాయించవచ్చు.మాజీ చీప్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి భూపాల పల్లి నుంచి స్పీకర్ మదుసూదనాచారిపై పోటీచేస్తారు. బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నాగం జనార్దనరెడ్డికి నాగర్ కర్నూలు టిక్కెట్ ఇస్తారు.పాలేరు నుంచి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి పోటీలో ఉండవచ్చు.మెదక్ నుంచి విజయశాంతి లేదా శశిదర్ రెడ్డి పోటీలో ఉండవచ్చు.

tags : congress, tickets

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info