A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ 60 మంది జాబితా ఇస్తుందా
Share |
September 26 2018, 4:55 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకేసారి 105 సీట్లకు అబ్యర్ధులను ప్రకటించడంతో కాంగ్రెస్ కూడా అభ్యర్ధుల కసరత్తులో బిజీ అయింది. మొదటి విడతే అరవై మంది పేర్లను ప్రకటించాలని భావిస్తోందట.అభ్యర్ధుల జాబితాలను తీసుకుని పిసిసి అద్యక్షుడు డిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతోంది.పార్టీ అధిష్టానం ఒకసారి పరిశీలించి తుది నిర్ణయం చేయవచ్చు.సిటింగ్ ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లు వస్తాయని అంటున్నారు. టీడీపీతో పొత్తు విషయంలో కోదాడ అసెంబ్లీ స్థానంపై కొంత సందిగ్ధం ఉన్నా.. ఆ సీటు టీడీపీకి ఇవ్వకపోతే అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మావతికి టికెట్‌ వస్తుందని బావిస్తున్నారని మీడియా కధనం.ఈ సందర్భంగా మీడియాలో పలువురు ప్రముఖుల పేర్లతో ఒక జాబితా ప్రచారంలోకి వచ్చింది.వీరంతా దాదాపు ఖరారైనట్లే.

హుజూర్‌నగర్‌ – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి;నాగార్జునసాగర్‌ – కె.జానారెడ్డి ; మధిర – మల్లు భట్టి విక్రమార్క ; నల్లగొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి; గద్వాల – డీకే అరుణ; ఆలంపూర్‌ – ఎస్‌.సంపత్‌కుమార్‌;కొడంగల్‌ – రేవంత్‌రెడ్డి; పరిగి – టి.రామ్మోహన్‌రెడ్డి; నర్సంపేట – దొంతి మాధవరెడ్డి; జహీరాబాద్‌ – గీతారెడ్డి; కల్వకుర్తి – వంశీచంద్‌రెడ్డి; వనపర్తి – చిన్నారెడ్డి ; జగిత్యాల– జీవన్‌రెడ్డి; బోధన్‌ – సుదర్శన్‌రెడ్డి ; ఆర్మూర్‌ – సురేశ్‌రెడ్డి; నిజామాబాద్‌ (టౌన్‌)– మహేశ్‌కుమార్‌గౌడ్‌; కామారెడ్డి – షబ్బీర్‌ అలీ; నిర్మల్‌ – మహేశ్వర్‌రెడ్డి; సంగారెడ్డి – జగ్గారెడ్డి; నర్సాపూర్‌ – సునీతా లక్ష్మారెడ్డి;

tags : congress, candidates

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info