A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముషీరాబాద్ టిక్కెట్ -మంత్రి నాయిని అలక
Share |
January 16 2019, 5:43 am

తను చెప్పిన అభ్యర్దికి టిక్కెట్ ఇవ్వలేదని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి బాదపడుతున్నారట.ముషీరాబాద్ నియోజకవర్గానికి ఆయన గతంలో ప్రాతినిద్యం వహించారు. కిందటిసారి బిజెపి అద్యక్షులు లక్ష్మణ్ గెలిచారు.ఈసారి ఆయన కార్పొరేటర్ ,తన కుటుంబ సభ్యుడు అయిన శ్రీనివాసరెడ్డికి టిక్కెట్ ఇప్పించాలని ఆశించారు. కాని దానిని కెసిఆర్ పెండింగులో ఉంచారు.దాంతో ఆయన కెసిఆర్ మీడియా సమావేశానికి కూడా రాలేదని చెబుతున్నారు.దీనిపై ఆయనను మీడియా ప్రశ్నించగా కేబినెట్‌ సమావేశంలో తాను పాల్గొనడం వల్లే, కేసీఆర్‌ విలేకరుల సమావేశానికి వెళ్లలేదని, ‘అయినా ముషీరాబాద్‌ టికెట్‌ శ్రీనివాసరెడ్డికి ఎందుకు రాదు... తప్పకుండా వస్తుంది’ అని ఆయన అబిప్రాయపడ్డారు. మరో నేత ముఠా గోపాల్ కు ఈ టిక్కెట్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరగడంతో నాయిని అలిగారని చెబుతున్నారు.

tags : nayini, musheerababd, ticket

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info