A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అప్పుడు ఓట్లు అడగనన్నారు కదా
Share |
April 21 2019, 11:46 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై సీనియర్ కాంగ్రెస్ నేత, జగిత్యాలలో ఆరుసార్లు గెలుపొందిన జీవన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు.కెసిఆర్ కుటుంబ పాలన, నియంతృత్వం, ఒంటెత్తు పోకడలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారని అన్నారు.ప్రచార ఆర్భాటాలు, కమీషన్ల కక్కుర్తి, సొంత డబ్బా తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పాడని, నాలుగేళ్లలో కేవలం 14 వేల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. రైతుబీమా పథకం పెద్ద మోసమన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ రద్దుతోనే కేసీఆర్‌ పతనం ప్రారంభమైందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఆయ న అహంకారపూరిత రాజకీయానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ శుద్ధజలాన్ని అందించే వరకూ ఓట్లు అడగబోమని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడెలా వెళ్తున్నారని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

tags : jeevanreddy, jagityala

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info