A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కు బిజినెస్ రిపార్మర్ అవార్డు
Share |
April 21 2019, 11:36 am

దేశంలోనే ప్రముఖ మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ అందించే ప్రతిష్ఠాత్మకమైన ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఇస్తున్నారు. ఈ విషయాన్ని టైమ్స్ గ్రూప్ ఎండీ వినీత్ జైన్ ఈ-మెయిల్ ద్వారా సీఎం కేసీఆర్‌కు బుధవారం సాయంత్రం తెలిపారు. దేశంలోనే అతి పిన్న వయసున్న రాష్ట్రమైనా.. పరిపాలనలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారని అభినందించారు. అద్భుతమైన నాయకత్వం వల్ల రాష్ట్రం రెండంకెల ఆర్థిక ప్రగతితో దూసుకుపోతున్నదన్నారు. పెట్టుబడుల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పడం, రైతులకు నేరుగా నగదు బదిలీ ప్రక్రియను విజయవంతంగా అమలు చేయడం, ప్రపంచంలోనే మొదటిసారిగా ఆటోమెటిక్‌గా అనుమతుల ప్రక్రియకు టీఎస్-ఐపాస్ ద్వారా శ్రీకారం చుట్టడం వంటి విజయాలను సీఎం కేసీఆర్ సాధించారని వినీత్ జైన్ పేర్కొన్నారు.
ఫలితంగా రాష్ట్రంలో సులభతరవాణిజ్య విధానాన్ని పెంపొందించడంలో ఘన విజయం సాధించారన్నారు. కొత్త రాష్ర్టాలు ఇలా పలు అంశాల్లో ప్రత్యేకత చాటడం అరుదైన సందర్భంగా అభివర్ణించారు. దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన జ్యూరీ బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు సీఎం కేసీఆర్‌ను ఎంపిక చేసిందని చెప్పారు. జ్యూరీ చైర్మన్‌గా భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యవహరించారని, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ చైర్మన్ నందన్ నిలేకనీ, పేటీఎం ఫౌండర్ విజయ్‌శేఖర్ శర్మ, టాటా సన్స్ డైరెక్టర్ హరీశ్ మన్వానీ, ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ ఆదిత్యపూరి కొటక్ మహీంద్రా ఎండీ ఉదయ్‌కొటక్, జేపీ మోర్గాన్ సీఈవో కల్పనా మోర్పారియా, సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్‌నర్ సిరిల్ ష్రాఫ్ తదితరులు సభ్యులుగా ఉన్నారని వినీత్ జైన్ వెల్లడించారు. ముంబైలో అక్టోబర్ 27న జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు.

tags : kcr, business reformer award

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info