ప్రధాన ప్రతిపక్షం లేకుండా మరోసారి అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అయ్యాయి. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అద్యక్షతన సభా వ్యవహరాల కమిటీ సమావేశం జరిపింది. ఈ నెల పందొమ్మిది వరకు సభ జరుగుతుందని, ఏడు వర్కింగ్ డేస్ ఉంటాయని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు.గత ఏడాదిపై గా అసెంబ్లీని ప్రదాన ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.ఇరవైరెండు మంది వైసిపి ఎమ్మల్యేలను కోట్లు పెట్టి చంద్రబాబు కొనుగోలు చేశారని, వారిపై అనర్హత వేటు వేయడం లేదని స్పీకర్ పై ఆరోపణలు చేస్తున్నారు. tags : ap,assembly, meetings