A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడరే
Share |
September 22 2018, 3:49 am

చంద్రబాబు గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తాడు గానీ, అమ్ముడుపోయిన గాడిదలకు కాదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు.నైతిక విలువల గురించి ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడడం చిత్రంగా ఉందన్నారు. స్పీకర్‌ వ్యవస్థను కోడెల శివప్రసాద్‌ భ్రష్టుపట్టించారని ఆయన అన్నారు. అన్ని విషయాలపై మాట్లాడే పవన్‌ కల్యాణ్‌ ఫిరాయింపు దారులపై ఎందుకు మౌనం వహిస్తారని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సభ ఉండదనీ, అసెంబ్లీలో సభా సంప్రదాయాలు, విలువలున్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలపై ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారనీ, చంద్రబాబుకు అంత ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో 175 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, 25 ఎంపీ నియోజకవర్గ ఇంచార్జిలు, పార్టీ ముఖ్య నేతలతో విశాఖపట్నంలో ఈ నెల 11న సమావేశం జరగనుందని ఆయన చెప్పారు.

tags : rambabu, pawan kalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info