A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ పై తీవ్ర పదజాలం వాడిన కాంగ్రెస్ నేత
Share |
April 20 2019, 8:04 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చాతకాక ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని, పాపాత్ముడి పాలన అంతమైందని మాజీ ఎమ్.పి మదు యాష్కి గౌడ్ అన్నారు.ఆయన మాట్లాడుతూ కెసిఆర్ పై తీవ్ర పదజాలం వాడారు.కేసీఆర్‌ గౌరవంగా మాట్లాడితే తాము మర్యాదిస్తాం అన్నారు. కాదని తాగుబోతులా మాట్లాడితే తాను కూడా తాగకుండా అదే రేంజ్‌లో తిడతానన్నారు. ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారమిస్తే.. కేసీఆర్‌ చాతకాకనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆయన ఎద్దేవ చేశారు.గాంధీ కుటుంబం గురించి కెసిఆర్ కు మాట్లాడే అర్హత లేదని ఆయన ద్వజమెత్తారు.పేకాట క్లబ్బులు ముసామని చెబుతున్న కేసీఆర్‌ పబ్బులు ఎందుకు తెరిచారో చెప్పాలన్నారు. నిస్వార్థంగా సోనియా తెలంగాణ ఇస్తే.. కేసీఆర్‌ మోసం చేసి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిని చేస్తామని ఆయన చెప్పారు.

tags : madhu yashki, kcr

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info