A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ విలన్ నెంబర్ 1- ఆ పార్టీనే పీడ-jకెసిఆర్
Share |
September 22 2018, 6:57 am

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నెంబర్ ఒన్ విలన్ అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తాను గతంలో పలు సార్లు ఈ విషయం చెప్పానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణకు ఇన్ని కష్టాలు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని, ప్రజలు కష్టపడి ఉద్యమం చేసి తెచ్చుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పీడ, దరిద్రం అని ఆయన అన్నారు. కాంగ్రెస్ అంటే పేకాట క్లబ్ లు,నకిలీ,బాంబుల మోతు, కరెంటు కోతలు 2014 కి ముందు ఇవన్ని స్వైర విహారం చేశాయని ఆయన అన్నారు.తాము అనేక ప్రాజెక్టులను పూర్తి చేశామని ఆయన అన్నారు. రైతాంగానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.కాంగ్రెస్ హాయంలో కుల వృత్తులు నాశనం అయ్యాయని,చేనేతలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, ఆ పరిస్థితిని మార్చామని అన్నారు.టిఆర్ఎస్ అదికారం వచ్చాక ఒక్క మతకల్లోలం చోటు చేసుకోలేదని అన్నారు. తన పీడ పోయిందని కాంగ్రెస్ నేతలు అన్నారని,నిజానికి కాంగ్రెస్ పీడ,దరిద్రం పోయిందని కెసిఆర్ అన్నారు.

tags : kcr, villan, no 1

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info