A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ సన్నాసులు,దద్దమ్మలు ఆరోపిస్తారా-కెసిఆర్
Share |
November 18 2018, 9:29 am

ఈ మద్యకాలంలో రాజకీయ అసహన వైఖరి ఉందని ,అది ఏ మాత్రం సరైనది కాదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. అసెంబ్లీ రద్దు అయినట్లు గవర్నర్ నోటిపికేషన్ ఇచ్చి ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కెసిఆర్ ను కొనసాగాలని కోరిన తర్వాత ఆయన మీడియా తో మాట్లాడారు.అనేక ఉద్యమాలు, త్యాగాల తర్వాత తెలంగాణను సాదించుకున్నామని, ఆ తర్వాత ఎవరితో పొత్తు లేకుండా తాము ఎన్నికలలోకి వెళితే ప్రజలు ఆశీర్వదించారని అన్నారు. రాస్ట్రం ప్రగతి చెందిందని,ప్రదాని,కేంద్ర మంత్రులు అంతా మెచ్చుకుంటున్నారని, 21 శాతం వృద్ది రేటుతో దేశంలోనే తెలంగాణ ముందు బాగాన ఉందని ఆయన అన్నారు. తనకు ఎకనమిక్ టైమ్స్ అవార్డు ఇచ్చారని అన్నారు.కాని ప్రతిపక్షాలు భయంకరమైన ఆరోపణలు చేస్తున్నాయని, కాకిగోల చేస్తున్నాయని అన్నారు.నీటి పారుదల ప్రాజెక్టులపై కేసులు వేయడం,రౌండ్ టేబుల్ పేరుతో ఇష్టం వచ్చినట్లు అవాకులు పేలుతున్నారని,అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.ఎంతో క్రమశక్షణతో ఆర్ధికాభివృద్ది సాదించామని అన్నారు. తాము బిజెపి కూటమిలో లేమని, అయినా కేంద్రమే తెలంగాణ ప్రగతిని మెచ్చుకుంటోందని, నలబై అవార్డులు వచ్చాయని ఆయన అన్నారు. కమిషన్ భగీరద అంటే కమిషన్ లు అని ప్రచారం చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులు అంటే కమిషన్ లు అని అన్నారు. ఈ సన్నాసి,దద్దమ్మలు ఈ అరవై ఏళ్లలో చేయని పనులు తాము చేపట్టామని, ఒక్క ఆదారం కూడా లేకుండా ఆరోపణలు చేస్తున్నారని కెసిఆర్ అన్నారు. ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే సహించలేకపోతున్నామని ఆయన చెప్పారు. ఒక్క నీటి పారుదల ప్రాజెక్టులకే 25 వేల కోట్ల రూపాయలు వ్యయం చేశామని ఆయన అన్నారు.

tags : kcr, allegations

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info