A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రెయిన్ కోట్లు వేసుకుని బిజెపి నేతల నిరసన
Share |
January 16 2019, 5:11 am

తాత్కాలిక సచివాలయ భవనం, అసెంబ్లీ బవనంలో వర్షాలు కురిసినప్పుడు లీక్ అవుతున్న నేపధ్యంలో బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విన్నూత్న నిరసన తెలిపారు.బీజేపీ ప్రజా ప్రతినిధులు గొడుగులు పట్టుకొని, రెయిన్‌ కోట్లు ధరించి వచ్చారు. వర్షాలకు సచివాలయంలో నీరు లీకవుతుండటం పట్ల వారు ఈవిధంగా నిరసన తెలిపారు. చిన్నపాటి వర్గానికి అసెంబ్లీ లోకి నీరు వస్తున్నందుకే తడవకుండా ఇలా వచ్చామని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. వర్షం పడితే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతో ఈవిధంగా రావాల్సి వచ్చిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగు కు 10 వేలు ఇచ్చి తాత్కాలిక అసెంబ్లి నిర్మాణం ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన అన్నారు.

tags : bjp, rain coats

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info